రెండు నెలల క్రితం, నేను భారతదేశం వస్తున్నాను అని డాడీ ఇల్లు అంత క్లీన్ చేయించి ఉంచారు. కొత్త ఇల్లు బాగా నచ్చేసింది. ప్రతి ప్రదేశం చాలా శుభ్రంగా ఉంది. భారతదేశానికి వచ్చిన తర్వాత మూడు వారాలకు ఫాస్ట్ ఫార్వార్డ్ చేయండి. కోవిడ్ కదా, బయట ఎవరిని ఇంట్లోకి రానివ్వట్లేదు. బాత్రూమ్ శుభ్రం చెయ్యాల్సిన సమయం ఒచ్చేసింది. మమ్మీకి ఇబ్బంది ఎందుకు అని, నేనే క్లీన్ చేస్తా అని చెప్పా. అమెరికాలో ఎలాగో మనమే ఓనర్ కుక్కర్ క్లీనర్. బయట ఎవరినన్నా పిలిపించి కేవలం పై పైనా క్లీన్ చేయించాలి అంటే ఒక గంటకు 100 డాలర్లు, అంటే దాదాపు 7000 రూపాయలు. ఎక్కువే కదా. అలా అలా మన పని మనమే చేస్కోడం అలవాటైపోయింది. కాబట్టి, ఇక్కడ నేను ఒక 3 గంటలలో 3 టాయిలెట్లు, ముసుగు వేసుకొని మరి శుభ్రం చేసాను. ఆ రోజుకి వర్కవుట్ దానితోనే అయిపోయింది. మమ్మీ ఆఫీసు నుంచి ఒచ్చి, “ఏ నానా క్లీన్ చేస్తా అన్నావ్, కుదర్లేదా?” అని అడిగింది. అంతే! నా సమయం, ప్రయత్నం అన్నీ అలా గాల్లో కలిసిపోయాయి. మా అమ్మ స్టాండర్డ్స్ లో మనం అంత బాగా క్లీన్ చేసాం అనమాట. సరేలే ఎవరినన్నా బయట నుండే పిలిపిస్తాను అని అమ్మ అనింది.
ఆ తరువాతి ఆదివారం, ప్యాంటు సగం పైకి మడుచుకొని, కర్రల సంచి పట్టుకొని ఒక అంకుల్ ఓచ్చారు. అయాన ప్రొఫెషనల్ టాయిలెట్ క్లీనర్. అయాన వచ్చి ఒక రెండు గంటలలో అన్నీ క్లీన్ చేసారు. నేను ఒక సారి వెళ్లి చూసుకుంటే నాకే ముచ్చటేసింది. అద్దం లా మెరిసిపోయేటట్టు క్లీన్ చేసారు. మొత్తం వెయ్యి రూపాయలు తీసుకున్నారు. పరవాలేదు. అప్పటికే లంచ్ టైం అవ్వడంతో, అమ్మ అతడిని భోజనం చేస్తావా అని అడిగింది. అప్పుడు అతను, “లేదు మేడం, మా ఇల్లు ఇక్కడే, ఇంట్లో ఫుడ్ రెడీ గా ఉంది. పర్వలేదు”, అని అన్నాడు. అప్పుడు నాన్న క్యూరియాసిటీతో ఎక్కడ మీరు ఉండేది అని అడిగారు. అతను “ఇక్కడే ఒక నాలుగు వీధిల అవతల, ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కున్నాను సార్. రోజూ ఓక ఐదు ఇళ్లు చేసినా, ఐదు వేలు వచ్చేస్తాయి. నెలకి ఒక లక్ష దాక మిగులుతుంది. ఇదీ కేవలం పార్ట్ టైమ్ వ్యాపారం. అదంతా పెట్టి కొత్త ఇల్లు కూడా కొన్నాను. ఇది నా నంబర్. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా కాల్ చేయండి” అని చెప్పారు.
ఆయన వెళ్లిపోయాక డైనింగ్ టేబుల్ మీద లంచ్ చేస్తు, మేమందరం ఆయన గురించి మాట్లాడుకున్నాం. అంటే మనకి ఓక మరుగుదొడ్లు శుభ్రం చేసే వ్యక్తి నెలకి లక్ష సంపదిస్తున్నాడు అనే విషయం, ఎందుకో సమాజం మనకి నేర్పించిన ఈక్వేషన్ లో ఫిట్ అవ్వదు. మనం మామూలుగా వైట్ కాలర్ ఎంప్లాయిస్ఏ బాగా సంపాదిస్తారు అన్నట్టు మిగతా వాళ్లని తక్కువ చేసి చూసే పక్షపాతం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో, “నేను రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ చేసుకుంటూ చదువుకుంటా అంటే”, “అయ్యో రామ, నీకేం కర్మ అలాంటి పనులు చేయడం” అని ఒక అడ్డు కట్ట వేస్తారు. ఎవరన్నా వాల్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడ్డ పని చేస్తున్నప్పుడు మనం గౌరవం ఇవ్వాలి. ఆ కష్టానికి గౌరవం ఇవ్వాలి. ఏ పని ఐనా పనే కదా. మనల్ని పెంచిన విదానం లోనో, మనం పెరిగిన విదానం లోనో, మనం ఎందుకో ఈ శ్రమ గౌరవం (డిగ్నిటీ ఆఫ్ లేబర్) ని అన్నీ పనులకి ఇవ్వము. మనకి సమాజం నేర్పించేవి అన్నీ సరి కాదు. కొన్ని సార్లు నేర్చుకుంది మర్చిపోయి, మళ్ళీ మన అనుభవాలతో కొత్తగా నేర్చుకోవాలి. ఈ ఎక్కువ తక్కువ అని సమాజం పెట్టిన నిబంధనలు ఉన్నాయ్ చూడండి, వాటిని ఒక సారి ప్రశ్నించుకుందాం.
GOOD MESSAGE
LikeLike
GOOD MESSAGE
LikeLike